Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన
అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రహీమున్నీసా బేగంకు నామినేటెడ్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ మహాసేన అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో రహీమున్నిసాబేగం ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఈ క్రమంలో ఆమె ధర్నాలు, రాస్తారోకోలో పాల్గొని అనేక కేసులను సైతం ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం రహీమున్నీసా బేగంను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహాసేన ప్రధాన కార్యదర్శి దైద ఇమ్మానియేల్, రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు ఎండీ సుభాని, ఎండీ షకీ తదితరులు పాల్గొన్నారు.