Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుకొండ
పరకాల నియోజవకర్గం నుంచి గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం 15, 16, 17డివిజన్ల పరిధిలోని పలు గ్రామాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యలతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాలల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పురోగతిలో ఉన్న అభివద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మొగిలిచర్లలోలో అభివృద్ధి పనులను, రెడ్డిపాలెం, ముస్త్యాలపల్లి జంక్షన్ పనులను పరిశీలించారు. గొర్రెకుంట ప్రజలు రోడ్డు విస్తరణకు సహకరించాలని వారు కోఆరు. ఈ రోడ్డు విస్తరణ లో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం మంజూరు చేస్తామన్నారు. ఏకశిలా జంక్షన్‌ను అభివద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కీర్తి నగర్, గరీబ్ నగర్లో సీసీ రోడ్లు, సైడుకాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు. కట్టమల్లన్న దేవాలయం, చెరువు కట్ట బ్యూటిఫికేషన్ పనులు పరిశీలించారు. అదే విధంగా జాన్ పాక శివారులో పండ్ల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అన్ని శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.