Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ సూచించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2021లో భాగంగా కేంద్ర బందాలు గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. అందువలన పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు సంసిద్ధంగా ఉండాలని ఎంపీఓ మధుసూదన్ సూచించారు. అదే విధంగా రూర్బన్ పథకం ద్వారా అమలయ్యే పనుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాల్సిందిగా డీపీఎం సింధూర తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.