Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తన చాంబర్లో నిలబెట్టి సమావేశం
నవతెలంగాణ-భూపాలపల్లి
పరిపాలన సౌలభ్యానికి, సమర్ధవంత నిర్వహణకు ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసి పాలనా అధికారిగా కలెక్టర్లను నియమించింది. కానీ, జయశం కర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఇందుకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లా సంక్షేమ శాఖ అధికారులపై వివక్ష చూపు తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. కొన్ని రోజులుగా పాలన, అభివద్ధి పరంగా ఛాంబర్ కే పరిమితమైన కలెక్టర్ రోజువారి సమయపాలన లేకుండా విధి నిర్వహణలో తోటి ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణ లొస్తున్నాయి. ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కావాల్సిన అది óకారులు సమయపాలన పాటించకపోవడం సదరు కలెక్టర్ రాత్రి 8, 9 గంటల వరకు సమావేశాలు నిర్వహించడంతో సమయం సరిపోక కార్యాలయానికి లేటుగా రావడం అధికారులకు ఆనవాయితీగా మారింది. ఇదిలా ఉంటే పలు శాఖల అధికారుల సమావేశాలు ఛాంబర్ కార్యాలయ కుర్చీల్లో కూర్చొని సమా వేశాలు నిర్వహిస్తే ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల సమావేశం మాత్రం అధికా రులను నిలబెట్టి నిర్వహించడం శోచనీయం. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని కలెక్టర్ చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారిణి సునిత, సంబంధిత వసతి గహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. కాగా అధికారులందరిని నిల్చోబెట్టి సమావేశం నిర్వహించడం వివక్షకు నిదర్శనమనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా కులమతాలకతీతంగా పాలన కొనసాగించాలని పలువురు అధికారులు కోరుతున్నారు.