Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్ కోరారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల కన్వీనర్ చిటమట రఘు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్టీ మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి ఇర్సవడ్ల వెంకన్న, అయూబ్ ఖాన్ హాజరై మాట్లాడారు. మండలంలో భారీ సంఖ్యలో సభ్యత్వాలు చేయించాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుందని, ఆ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎన్రోలర్లు ఇన్ఛార్జీల, బూత్ కమిటీల నాయకుల, జిల్లా, మండల నాయకుల, వార్డు సభ్యుల సాయంతో పెద్దఎత్తున సభ్యత్వాలు చేయించాలని కోరారు. సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మహ్మద్ ఖలీల్ ఖాన్, వావిలాల ఎల్లయ్య, చెన్నూరు బాలరాజు, దేవుళ్లపల్లి విజయకుమార్, గుడ్ల దేవేందర్, తదితరులు పాల్గొని బూత్ ఇన్ఛార్జీలను నియమించి బాధ్యతలను అప్పగించారు.