Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
మండలంలోని కుమ్మరికుంట్లలో జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షుడు గుండె రామనర్సయ్య ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ మహబూబాబాద్‌లో తలపెట్టిన సంకల్ప సభకు పలువురు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రామనర్సయ్య మాట్లాడారు. బహుజనులు రాజ్యాధికారం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. ప్రవీణ్‌కుమార్ సారధ్యంలో బహుజనులు హక్కులు కోసం పని చేస్తామని తెలిపారు.