Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేరణ' అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం
నవతెలంగాణ-హన్మకొండ
విద్యార్థులు భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ స్ఫూర్తితో గణితంలో పట్టు సాధించాలని ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి కోరారు. న్యూశాయంపేటలోని ప్రభుత్వ హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వామి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో గణితం పట్ల ఆసక్తి పెంచుకుని పట్టుదలతో రాణించాలని సూచించారు. శ్రీనివాస రామానుజన్ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశారని చెప్పారు. ఆయన తరహాలో విద్యార్థులు గణితంలో రాణించాలని ఆకాంక్షించారు. తొలుత విద్యార్థులకు క్విజ్ కాంపిటేషన్, టాలెంట్ పజిల్, తదితర పోటీలు నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవయాని, పుష్పలత, సుమలత, భాస్కర్, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.