Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
హన్మకొండ బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 2012 నుంచి కేంద్ర ప్రభుత్వం రామానుజన్ గణిత శాస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా ఆయన జయంతి ని జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఏటా రామానుజన్ జయంతిని జాతి మొత్తం జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గణితంపై విద్యార్థులకు మరింత మక్కువ పెరిగేలా శ్రీనివాస్ గురుకుల్ యాజమాన్యం వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. విద్యార్థినులు గణిత రంగోలిలు వేసి పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో 'లైఫ్ ఆఫ్ రామానుజన్' అంశంపై సెమినార్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ, సీనియర్ గణిత ఉపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రంగించారు. గణితం నేర్చుకుంటే కలిగే ప్రయజనాలను వివరించారు. అలాగే గణితం నేర్చుకోవడం ఎంత తేలికో అవగాహన కల్పించారు. గణితంపై ఉన్న అపోహలను తొలగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిదురాల ఇందిర, ఉపాధ్యాయులు యుగందర్, వినరు, విజరు, రాజేష్, వంశీ, పద్మశ్రీ, నీలిమ, హఫీజ, అనూష, మాధవి, రేవతి, లాస్య, శ్రీనివాస్, తదతరులు పాల్గొన్నారు.