Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్నవతెలంగాణ-రేగొండ
శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో విద్యార్థులు గణితంలో రాణించాలని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో బుధవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి హాజరై శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం విద్యా ర్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల గణిత ఎగ్జిబిట్లను పరిశీలించారు. తదనంతరం ఉత్తమ ఎగ్జిబిట్లు ఏర్పాటు చేసిన విద్యార్థులకు బహూమతులు అందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. గణితంలో శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తితో రాణించాలని కోరారు. తద్వారా తల్లిదండ్రుల, పాఠశాల అధ్యాపకుల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని సూచించారు. గణితంలో శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి ఫలితంగా ఆయన జయంతిని గణిత దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో దేశవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా స్ఫూర్తి పొందాలని, గణితంలోనే కాకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ పాల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.