Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -గీసుకొండ
కొనాయమాకుల శివారులోని పీడీఆర్.గారెన్స్‌లో బుధవారం పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేకు కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు పోలీసుల ధర్మారావు, గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, సర్వోదయ యూత్ ఆర్గనైజర్ దామోదర్, తహశీల్దార్ రాజేంద్రనాథ్, సర్పంచులు ఛత్రు నాయక్ సుదర్శన్, సంఘం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పరకాల
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన క్రైస్తవులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దస్తులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణ-గోవిందరావుపేట.
బాలాజీనగర్‌లో బుధవారం అగ్ని మినిస్ట్రీ సొసైటీ డైరెక్టర్ ఫౌండర్ బిషప్ డాక్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పేర్ల వినరు చంద్రకళ ఆధ్వర్యంలో బిషప్ డాక్టర్ ప్రేమ్ కుమార్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి బాలాజీ నగర్ ఎంపీటీసీ పూర్ణ ధరావత్, దావత్ గంగు, ఉప సర్పంచ్ అజ్మీర బుజ్జమ్మ, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు జాటోత్ చంద్రకాంత్ పాల్గొన్నారు.
నవతెలంగాణ - ఖానాపురం
స్థానిక ఎంపీపీ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో మిని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందభ్రంగా ఆయన కేకు కట్ చేసి సిబ్బందికి పంచారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బాలు, ఎంపీఓ పర్వీన్ కైసర్, జూనియర్ అసిస్టెంట్ వెంకన్న, పంపు మెకానిక్ రమేష్, కంప్యూటర్ ఆపరేటర్ గుణ శ్రీ తదితరులు పాల్గొనానరు.
నవతెలంగాణ-సంగెం
ప్రతిఒక్కరూ దయాగుణం అలవర్చుకోవాలని ఎస్సై హరిత అన్నారు. మంగళవారం రాత్రి కుంటపల్లిలోని బేడ బుడగ జంగాల కాలనీలో ప్రేమ్ స్వరూప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ పాల్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడులకు ఆమె హాజరై మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చిర్ర పాల్, చిర్ర రాజ్ కుమార్, బొజ్జ సురేశ్, దుపాకి కార్తీక్, చిర్ర జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హసన్‌పర్తి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. క్రిస్మస్ పండుగ సంధర్బంగా పాత హసన్‌పర్తి, హన్మకొండ మండలాల పేద క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ ప్యాక్‌ల బుధవారం ఎర్రగట్టుగుట్ట క్రాసురోడ్డులోని బాలాజీ గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్, జెడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, ఎంపీపీ కేతపాక సునితరాజు, కార్పొరేటర్లు దివ్యరాణిరాజునాయక్, రజిత వెంకట ేశ్వర్లు, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
నవ తెలంగాణ-ధర్మసాగర్
స్థానిక సెయింట్ మ్యాథ్యూస్ హైస్కూల్ హెచ్ఎం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ పండుగ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెయింట్ మ్యాథ్యూస్ సెక్రటరీ మేరీ జారు, కరస్పాండెంటె శరీల్ జారు, డీన్ గంగారపు ఆగస్టీన్లు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సెమి క్రిస్మస్ పండుగ సందర్భంగా విద్యార్థులు సాంస్కతిక, ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు సుస్మిత, , విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.