Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఆహార ఉత్పత్తుల సాధనలో పాలుపంచుకొనే ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఆత్మ విశ్వాసాన్ని నింపుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మినీ స్టేడియం ఆవరణంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్ అధ్యక్షతన నిర్వహించిన కిసాన్ క్రెడిట్ కార్టుల పంపిణీ, అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంట సాగు చేసే రైతుతో పాటు ఆహార ఉత్పత్తులను సాధించే పాడి, మత్య్స, గొర్లు, మేకల పెంపకదారులను కూడా రైతులుగానే పరిగణించి కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తుందని తెలిపారు. ఆయ సొసైటీల పరిధిలోని వారందరు ధరఖాస్తు చేసినట్లయితే అధికారులు గుర్తించి కిసాన్ క్రెడిట్ కార్డులను ఆయ ధత్తత బ్యాంకులు అందిస్తాయన్నారు. కార్డు ఉన్న ప్రతి రైతుకు ఎలాంటి జామీను లేకుండా బ్యాంక్‌లు రూ.25వేల నుంచి 1.60లక్షల వరకు నేరుగా రుణ సదుపాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాబార్డు అధికారి, విజయ డైరీ అధికారి, పశుసంవర్థక శాఖ జేడీ బాలకృష్ణ, మత్స్య శాఖ జిల్లా అధికారి నరేష్, తదితర బ్యాంక్ మేనేజర్లు, ఆయ మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సంఘాల పురోగతితో ఆర్థిక ప్రగతికి బాటలు
స్వయం సహాయక సంఘాలు పురోగతి సాధిస్తే ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయ సెమినార్ హాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నర్సంపేట మండలంలోని 5 గ్రామాల్లోని 81 స్వయం సహాయక సంఘాలకు రూ.8.10కోట్ల లింకేజి రుణాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. మహిళా సాధికారత సాధించడానికి సంఘాలు ఆర్థిక పరిపుష్టత దిశలో పయనించినట్లయితే సామాజిక అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న టెక్స్టైల్స్ పార్కుతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కల్పనకై ప్రణాళిక రూపొందించమన్నారు.న్యాక్ ద్వారా వివిధ రంగాలలో నైపుణ్యత సాధించడానికి దోహదపతున్నామని చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్, కెనరా బ్యాంక్ మేనేజర్ వినోద్ జోషి, ఎంపీపీ మోతె కలమ్మ, ఓరుగల్లు మహా సమాఖ్య అధ్యక్షురాలు మోటూరి శ్వేత, ఏపీఎం మహేందర్, ఫ్యాక్స్ చైర్మన్లు, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు. అనంతరం పవన్ నర్సింహౌం ఆధ్వర్యంలో డాక్టర్ లెక్కల విద్యా సాగర్ రెడ్డి మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. పలు రకాల రోగాలపై అప్రమత్తగా ఉండాలని సూచించారు.