Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ వినియోగంపై
విస్తృత ప్రచారం కల్పించాలి
అ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
శశాంక్ గోయల్
నవతెలంగాన-జనగామ
జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించి పకడ్బందీగా తుది ఓటరు జాబితా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్ వంటి పలు అంశాలపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకున్నప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబం ధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందు తున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. అదే సమయంలో వివిధ వయస్సుల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని సూచించారు. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు సవరణలు తదితర అం శాలకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే శుక్రవారంలోగా ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లిటిరస్ క్లబ్బులు ప్రారం భించాలని ఆదేశించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలన్నారు. వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఈవీఎం గోడౌన్లను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో 16990 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో వివిధ కారణాల వల్ల 728 తిరస్కరించామని, 15250 పరిష్కరించామని, 1011 పెండింగులో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఏ భాస్కర్‌రావు, ఎస్డీసీ మాలతి, డీఆర్డీవో జి రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏతేషాం అలీ, తదితరులు పాల్గొన్నారు.