Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దళితుల ఇండ్ల స్థలాల పై రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురి
అ బాధ్యులైన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి
అ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-పాలకుర్తి
దళితుల భూ సమస్యపై పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి టి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితులు తమ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరాహారదీక్షలు బుధవారం ఎనిమిదో రోజు కొనసాగాయి. కేవీపీఎస్ ఆధ్వర్యం లో సంఘీభావం తెలుపు తూ ర్యాలీ నిర్వహించారు. అనం తరం డిప్యూటీ తహసిల్దార్ హరి ప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లా డుతూ... పట్టా కాగితాలు వున్న 52 దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాల భూమిని కబ్జాకోరులకు కట్టబెట్టిన తహసీల్ధార్ విజయ భాస్కర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 1993 లో నాటి ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం పట్టా లు ఇస్తే స్థానిక ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల తో కుమ్మక్కై కబ్జా చేశారని, ఆ భూములకు హద్దులు నిర్ణయిం చి దళితులకు ఇవ్వాలన్నారు. తహసీల్ధార్ నలుగురికి అక్రమ పట్టాలు చేయడం శోచనీయమన్నారు. రెవెన్యూ అది óకారుల తప్పిదాలతో భూమి కబ్జా అయిందన్నారు. కబ్జా దారులకు అనుకూలంగా అధికారులు మాట్లాడటం అవివేకమన్నారు. దళితులకు కేటాయించిన భూమి లో సగం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇచ్చిందన్నారు నిర్మాణం అయిన తర్వాత ఆ ఇండ్లు బీసీలకు ఇస్తామని, ఎస్సీలకు ఇవ్వమని అధికారులు అనడం కులవివక్ష కు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూటి దేవదానం, బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, జిల్లానాయకులు యాదగిరి, బహుజన కులాల ఐక్య వేదిక వ్యస్థా పక అధ్యక్షులు గుమ్మడి రాజుల సాంబయ్య, ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిర పాల్గొన్నారు.