Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాకు చెందిన ఆగాపే ఇంటర్ పేయిత్ మినిస్ట్రీ పౌండర్, కవి, ప్రఖ్యాత ప్రెస్టన్ పాఠశాల పూర్వ ప్రధానో పాద్యాయులు, క్రైస్తవ దిగ్గజం కెఎం జాన్ ముఖ్య మంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఘన సన్మానం పొందారు. బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ హించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని విస్త తంగా సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తింపుగా సత్కారం లభించింది. జనగామ కేంద్రంగా 1999లో మినిస్ట్రీ ప్రారంబించిన నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో అనాధలు, వద్దులు, వితంతువులకు సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలు చేశారు. విద్యావేత్తగా ఎందరినో శిష్యులుగా తీర్చిదిద్దిన జాన్ ఆదర్శప్రాయులు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. కెఎం జాన్‌కు రాష్ట్రస్థాయిలో గౌరవం దక్కడం పట్ల మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్,ప్రెస్టన్ కాలేజీ ప్రిన్సిపాల్ పి ఎజ్రా శాస్త్రి, బ్లాక్ టు బ్లాక్ ఎస్ దేవదాస్, ఆగాపే స్కూల్ హెడ్ మాస్టర్ తాటి రాజు, ఎం.మంజుల, కె. మల్లయ్య, ప్రవీణ్ , పాస్టర్ మోజెస్ కుమార్, బక్క ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, మోడల్ మార్కెట్ ఎరియా అభి వేదిక అద్యక్షుడు జి.కష్ణ, మచ్చ బాలనర్సయ్య, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.