Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో బుధవారం గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ పాల్గొని శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేశారు. అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ చిన్నవయసులోనే ప్రపంచంలోనే గణిత మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తి శ్రీనివాస రామానుజన్ అన్నారు. పేదరికంలో జన్మించి రామానుజన్ గణిత ప్రయోగాలు చేస్తూ ప్రపంచంలో ఉన్న గణిత మేధా వులు అర్థంకాని గణిత సమస్యలను సంధించిన వ్యక్తి అన్నారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు చేసిన గణిత నమూనాలు ఆకట్టుకున్నాయి.
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో శ్రీనివాస రామా నుజం జన్మదినోత్సవ సందర్భముగా గణిత దినోత్సవాన్ని కళాశాలలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. కొటేష్ శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాల వేసి రామానుజం గురించి విద్యార్థులకు వివరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంతోష్, అధ్యాపకులు శ్రీధర్ సింగ్, నరేందర్, లాకుమాలాల్, సరిత, సదాశివుడు, భాస్కర్, రాజేష్, బాబూలాల్, రాజు, స్నేహ, హనుమ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం పాఠశాలలో
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఉన్న ఎంజీఎం పాఠశాలలో బుధవారం భారత గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు కళారూపాలు తదితర అంశాలను విద్యార్థులతో చెప్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
రామానుజన్ సేవలు చిరస్మరణీయం
నవతెలంగాణ-కొత్తగూడ
గణిత శాస్త్ర అభివద్ధికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు చిరస్మరణీయమని పోగుల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుమ్మడి లక్ష్మీనా రాయణ కొనియాడారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని పొగుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గణితశాస్త్ర పత్రికలు పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి అనతికాలంలోనే రామానుజన్ పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. అలా రామానుజన్ స్పూర్తి తో ప్రతి విద్యార్థి ఒక మేధావి కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణిత ఉపాధ్యాయులు ఎన్ సుమన్, రాజు, మురళి, మోతిలాల్,వెంకటయ్య, శ్రీనివాస్, నర్సింగరావు, రాణి, సుమలత, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలి
నవతెలంగాణ-తొర్రూరు
విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సిద్ధార్థ హై స్కూల్ చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. గణితంపై క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సోమేశ్వర రావు మాట్లాడుతూ గణితానికి, మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉందని అన్నారు. అనేక వత్తులు, సంగీతం, ఆటలు, కళలన్నింటిలో గణిత భావనలు ఇమిడి ఉంటాయన్నారు. గణితం శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊపిరి వంటిదన్నారు. భారతీయ గణిత శాస్త్రవేత్తగా చిన్న వయసులోనే అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన శ్రీనివాస రామానుజన్ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి విశేష కషి చేశారన్నారు. గణిత ఉపాద్యాయులు రమేష్, సోమేశ్వర్, సురేందర్ ఉపాద్యాయుని, ఉపాద్యాయులు ప్రభాకర్, కుమాస్వామి, భాను చందర్,దుర్గ ప్రసాద్ రాజు, ఎల్లగౌడ్, మంజుల, కవిత, కల్పన, కోమల,పద్మ,రేణుక పాల్గొన్నారు.