Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని కేయూ ఎన్ఎస్ఎస్ విభాగం సంచాలకులు డాక్టర్ ఈసం నారాయణ అన్నారు. బుధవారం బుధవారం ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన నాలుగు ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కషి చేయాలన్నారు. కేయూ పరిధిలోని ఎన్ఎస్ఎస్ విభాగం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా పర్యావరణ సమస్య, మొక్కల పెంపకం, ఓటరు నమోదు వంటి కార్యక్రమాలపై ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రజలలో అవగాహన కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, ఎన్ఎస్ఎస్ విభాగం కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్. నాగయ్య, డాక్టర్ కనకయ్య. డాక్టర్ చందూలాల్, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.