Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంపార్టెంట్ టెక్నాలజీతో తయారీ
సామాన్యులకు అందుబాటులో ధర
నవతెలంగాణ-శాయంపేట
పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ ఖర్చయ్యేది ఇసుకకే. గోదావరి ఇసుక ధర సామాన్య ప్రజానీకానికి అందనంత ఎత్తులో ఉంది. దీంతో వారు తమ ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అడియాస గా మారుతోంది. ఈ సమస్యకు చెక్‌పెడుతూ ఇంపార్టెంట్ టెక్నాలజీతో హైడ్రోవాష్ సాండ్ నాణ్యత ప్రమాణాలతో అతి చౌకగా లభిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించింది.
మండలంలోని గోవిందాపూర్ శివారులో ఎర్రబెల్లి రవీందర్రావు ఈఆర్ఆర్ హైడ్రోవాష్ రోబో సాండ్ పరిశ్రమను లండన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇంపోర్టెడ్ టెక్నాలజీ ద్వారా కార్వార్ డిజైన్ ఇంజనీర్ పర్యవేక్షణలో నెలకొల్పారు. ఈ పరిశ్రమను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిలు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించారు.
ఇంపార్టెంట్ టెక్నాలజీతో ఇసుక తయారీ..
లండన్ నుంచి దిగుమతి చేసుకున్న మిషనరీతో కార్వార్ డిజైన్ ఇంజనీర్ సాయంతో ఇంపార్టెంట్ టెక్నాలజీ వినియోగించుకుని డస్టు నుంచి వాటర్, కెమికల్‌తో శుద్ధి చేసి క్వాలిటీ ఇసుకను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన ఇసుక గోదావరి ఇసుక కంటే అధిక మన్నిక కలిగి ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు.
నాణ్యత ఎక్కువ... ధర తక్కువ..
హైడ్రోవాష్ ఇసుక గోదావరి ఇసుక కంటే ఎక్కువ నాణ్యతతో ఉంటుందని, ధర కూడా సామాన్యులకు అందుబాటులో లభిస్తున్నట్లు ఈఆర్ఆర్ సంస్థ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రవీందర్ రావు తెలిపారు. కట్టుబడి పనులకు వినియోగించే ఇసుక టన్నుకు రూ.లు 550లకు లభిస్తుండగా, స్లాబ్, పిల్లర్లకు వినియోగించే ఇసుకకు టన్నుకు రూ.లు 650చొప్పున విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు.
సుదూర ప్రాంతాలకు సరఫరా..
ఈఆర్ఆర్ హైడ్రోవాష్ సాండ్‌లో తయారైన ఇసుకను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నదిలో సహజసిద్ధంగా వచ్చే ఇసుకను ఎక్కువగా తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. నదీ జలాలలో ఇసుకను తోడకుండా భూగర్భ జలాలను రక్షించుకోవడానికి హైడ్రోవాష్ సాండ్ ద్వారా తయారైన ఇసుకను వినియోగించుకొని కట్టడాలు నిర్మించుకోవాలని ఇంజినీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. గోదావరి ఇసుకలో మట్టి, రాళ్లు ఉంటాయని, హైడ్రోవాష్ ఇసుకలో ఎలాంటి మట్టి రాళ్లు ఉండవు. ప్రజల్లో కూడా ఇప్పటికే హైడ్రోవాష్ శాండ్‌పై పూర్తి అవగాహన వచ్చిందని, రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.