Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యశోద' సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
సేవా కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-నర్సంపేట
నైపుణ్యత పెంపొందించుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడపెల్లి-రాంపూర్ జంట గ్రామంలో యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50కోట్లతో నిర్మించిన యశోద సేవా కేంద్రంలో మెగా ఫంక్షన్ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ ఎందరో అనాథ, నిరుపేద యువతకు అండగా నిలిచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. యశోద గ్రూప్ సంస్థ నైపుణ్యాలు పెంపొందించి సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి చాలా దోహదపడుతుందని అన్నారు. సొంత ఊరు అనే మమకారంతో మెగా ఫంక్షన్ హాల్ నిర్మించడమే కాకుండా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సెంటర్‌ను చుట్టూర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు, సర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.