Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్డీఎం మేనేజర్ రాఘవేంద్రరావు
నవతెలంగాణ-తొర్రూరు
కిసాన్ క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకొని పాడి రైతులు ఆర్థికంగా అభివద్ధి సాధించాలని ఎల్డీఎం మేనేజర్ రాఘవేంద్రరావు, పశుసంవర్ధక శాఖ జేడీ సుధాకర్ అన్నారు. తొర్రూరు పాల శీతలీకరణ కేంద్రంలో చైర్మెన్ రాసాల సమ్మయ్య అధ్యక్షతన పాడి రైతులకు గురువారం కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులు ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డులను వినియోగించుకోవాలని కోరారు. తొర్రూరు పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో 130 మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అందించినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ ద్వారా రూ.23 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం ఉంటుందని చెప్పారు. అనంతరం జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా పాల కేంద్రంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి వెంకన్న, పాల కేంద్రం మేనేజర్ వెంకటనారాయణ, సూపర్వైజర్లు అశోక్, రమేష్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.