Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
వికాస అగ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ మిర్చీ టాస్క్ ఫోర్స్ కామర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం నానాటికీ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడుతోందని ఆందోళన వెలి బుచ్చారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ముందుకురావాలని, జై జవాన్ జై కిసాన్ నినాదం ఆచరణాత్మకం కావాలని ఆకాంక్షించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేలా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఉద్దీపనలు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ సురేంద్ర యాదవ్, రైతు సమన్వయ సమితి కోఆర్డి నేటర్ షేక్ మదార్, వికాస్ ఆగ్రీ ఫౌండేషన్ ప్రతినిధులు శెట్టిపల్లి తిరుపతిరావు, నేలపట్ల శేషారెడ్డి పాల్గొన్నారు.