Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన గిఫ్ట్ ప్యాకెట్లను ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, మహబాబూబాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా పేద, మధ్య తరగతి కుటుంబాల కండ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హిందూ, ముస్లిమ్, క్రైస్తవ పేదల కోసం పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ గంగుల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ తాత గణేష్, సర్పంచ్‌లు ధనసరి కోటమ్మ, పోలెబోయిన వెంకటేశ్వర్లు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ బాబా, తహసీల్దార్ నాగ భవానీ, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్, ఉపాధ్యక్షుడు తిరుమల ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి, నాయకులు జర్పుల శ్రీనివాస్, ఏనుగుల రాకేష్, పగడాల శ్రీనివాస్, బానోత్ మంత్రియ తదితరులు పాల్గొన్నారు.