Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
రాయినిగూడెం పీహెచ్సీ పరిధిలోని సర్వాపూర్ సబ్ సెంటర్లో గురువారం బస్టాండ్ సెంటర్లో ఆటో డైవర్లకు, పశువుల కాపారులకు, పలువురికి ఎక్కడ దొరికితే అక్కడే వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్బంగా ఏఎన్ఎం ఉపేంద్ర మాట్లాడారు. మొదటి డోస్ నూరు, రెండో డోస్ 94 శాతం పూర్తి అయ్యిందన్నారు. రెండు డోసులు వేసుకుంటే ఓమిక్రన్ నుంచి ప్రాణాలకు ముప్పు ఉండదని చెప్పారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సబ్ సెంటర్ పరిధిలోని 3 గ్రామ పంచాయతీల్లోని పల్లెల్లో ప్రతిరోజూ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎం సులోచన, ఆశావర్కర్లు రమాదేవి, సారలక్ష్మి, ధనలక్ష్మి, ఈశ్వరి, మమత, తదితరులు పాల్గొన్నారు.
ఆశావర్కర్లకు 3 నెలల జీతం బోనస్‌గా ఇవ్వాలి
యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్
ఆశావర్కర్లకు మూడు నెలల జీతం బోనస్‌గా ఇవ్వాలని ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. రెండేండ్లుగా ప్రాణాలకు తెగించి కరోనా నిర్మూలన కోసం రాత్రింబవళ్లు కష్ట పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన 16 నెలల పెండింగ్ ఇన్సెంటివ్ డబ్బులు రాష్టం వెంటనే ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనం, పీఆర్సీ జీఓ విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.