Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రాజెక్టు నగర్ బాలికల పాఠశాల విద్యార్థులకు చందన ఫౌండేషన్ అధినేత, ఇల్లందు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వెనిగల రవి సహకారంతో ఎమ్మెల్యే సీతక్క గురువారం నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. రవికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తొలుత విద్యార్థుల మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను పుస్తకాలను, బ్యాగులను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మొట్లగూడెంలోని గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, రవీందర్రెడ్డి, కుర్సం కన్నయ్య, చిదం చంద్రు, అజ్మీర శ్రీధర్, సర్పంచ్ గడ్డం అరుణ, తండాల శ్రీను, సర్పంచ్ సనప సమ్మయ్య, అలుగుబెల్లి కన్నయ్య, అళ్లెం ప్రభాకర్, తండాల శ్రీనివాస్, భూషణబోయిన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.