Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ వెంకట్ నర్సింగ్ రావు
నవతెలంగాణ-జఫర్గడ్
మండల కేంద్రంలోని పాఠశాలకు, రోడ్డు మూలమలుపు, చారిత్రక కట్టడాల దగ్గరగా ఉన్న మూడు వైన్ షాప్‌లను తరలించాలని సర్పంచ్ బల్లెపు వెంకటనరసింగరావు అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడు వైన్ షాప్ లను వేరే చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల వల్ల పురాతన కట్టడాల పరిసరాల్లో మందుబాబుల ఆగడాలతో అపరిశుభ్రం నెలకొందన్నారు. రోడ్డు మూలమలుపు వద్దే వైన్‌షాపులు ఉండడం రద్దీతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉపసర్పచ్ నంచర్ల లత యాదగిరి ,వార్డ్ సభులు సారంగం, శివ రాజు, ఎల్లయ్య, మమత , ఆయేషా బేగం, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు