Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బికేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు
నవతెలంగాణ-కోల్బెల్ట్
రైతుకూలీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భూపాలపల్లి జిల్లా రెండవ మహాసభ భూపాలపల్లిలోని కొమురయ్య భవన్ లో కుంభం ముకుంద రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ రాములు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిం చాలన్నారు. ఎల్ఐసి ,బ్యాంకులు, గనులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి గడీల పాలన కొనసా గిస్తున్నాడన్నారు. దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం హామీలు నీటిమూటలయ్యాయన్నారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. అనంతరంతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోతె లింగారెడ్డి ప్రసంగించారు. ఈ నెల 29, 30 తేదీలలో మేడ్చల్ జిల్లా కీసర లో జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరుమాళ రాజయ్య ,డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి పసరగొండ మహేందర్, మేము నూరి సదానందం, పెంటరవి, భోగి రాజయ్య, వలస కష్ణ స్వామి , భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక:
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెంట రవి, ప్రధాన కార్యదర్శిగా పరుమాళ్ల రాజయ్య ,కార్యదర్శిగా ఎలిషా కార్యవర్గ సభ్యులుగా కుంభంముకుందరెడ్డి , మహేందర్ ,కుమార్ స్వామి, భోగి రాజయ్య ,గుర్రాల రవీందర్ రాజ పోచయ్య, ఎన్నికైనారు.