Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం
రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
ఆర్జి త్రీ ఓసి-1 ప్రమాదంలో మతి చెందిన డంపర్ ఆపరేటర్ శ్రీనివాసరావు కుటుంబీకులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం రీజియన్ పరిది ఆర్ జి త్రీ డివిజన్ ఓసి-వన్‌లో గురువారం తెల్లవారు జామున ప్రాజెక్టు క్వారీ ఏరియాలోనీ పని స్థలంలో పొగ మంచు తో కమ్మి ఉందని, క్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల డంపర్‌ను రివర్స్ తీస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో డంపర్ ఆపరేటర్ శ్రీనివాసరావు చనిపోయారన్నారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమన్నాఉ. ప్రమాదానికి కారకులైన వారిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ని ప్రమా దాలు జరిగినా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవట్లేద న్నారు. ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ రక్షణ పై, కార్మికుల ప్రాణాలపై లేదన్నారు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మరోపక్క సింగరేణి యాజమాన్యం సింగరేణి ఆవిర్భావ వేడుకలు సంబరాలు జరపడం సిగ్గుచేటని అన్నారు. ఈ వేడుకలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుకాసర్ల ప్రసాద్ రెడ్డి, రాళ్ళబండి బాబు,తెలంగాణ జన సమితి భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రత్నం కిరణ్, టీఎస్యుఎస్ నాయకులు దాసరి జనార్ధన్, జయశంకర్ ,కే. లింగయ్య, రవి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.