Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన వట్టి రత్నాకర్ రెడ్డి తల్లి మరణించగా, బాధిత కుటుంబాన్ని గురువారం మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరామర్శించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ రూరల్ అధ్యక్షులు బెలిదే వెంకన్న, కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, ఛాగల్ గ్రామ సర్పంచ్ పోగుల సారంగపాణి, సీనియర్ నాయకులు బూర్ల శంకర్, పల్లె రవీందర్, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.