Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యుత్ నిలిపేసిన అధికారులు
ఎండుతున్న నార్లు, తాగునీటికి తప్పనిపాట్లు
నవతెలంగాణ-బచ్చన్నపేట
బచ్చన్నపేట మండలం ఎద్దుగూడెం, రామ్నగర్ కాలనీల్లో 50 కుటుంబాలు సుమారు 200 మంది నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి సుమారు 2 నుంచి 5ఎకరాల్లోపు వ్యవసాయ భూములు ఉన్నాయి. వివిధ రకాల పండ్లతోపాటు వరి సాగు చేసుకుంటారు. ఈ ఏడాది ప్రభుత్వ నిబంధనలతో తినడానికి అవసరమయ్యే వరిని ఒక్కో కుటుంబం ఎకరా చొప్పున నార్లు పోసుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం ముందస్తు సమా చారమివ్వకుండా విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీంతో నారు మడులు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. తమ వ్యవసాయ మోటర్లకు సంబంధిం చిన విద్యుత్ బిల్లులు ఏటా సకాలంలోనే చెల్లిస్తున్నటప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపేయటంలో ఆంతర్యమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, కాలనీలు అంధకారంలో కొట్టుమిట్టాడుతు న్నాయని వాపోతున్నారు. ఇంటి బిల్లులను కూడా నెలనెలా చెల్లిస్తున్నామని ఉన్నతా ధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వరి నారు ఎండిపోయింది : ఎద్దు శివలింగం, బాధిత రైతు
మూడు రోజుల నుండి విద్యుత్ సరఫరా లేక నాకున్న ఎకరా పొలంలోని నారుమడి పూర్తిగా ఎండిపోయింది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వ్యవసాయ మోటార్ విద్యుత్ బిల్లులు ఏటా చెల్లిస్తున్నాను. పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం : చిట్టి కలమ్మ
మా కాలనీ కి వచ్చే విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్ బిల్లుల బకాయి ఉంటే కాలనీకి వచ్చే మొత్తం లైను కట్ చేయడం సరికాదు.