Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాల్గొన్న జెడ్పీ చైర్మెన్లు కనకయ్య, బిందు నాయక్
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఇర్సులాపురం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాసమళ్ళ నాగేశ్వరావు తల్లి రాసమళ్ల నర్సమ్మ ప్రధమ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ పూలు చల్లి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, బయ్యారం ఉపసర్పంచ్ కవిత సంపత్, వార్డ్ సభ్యులు బానోత్ రమేష్, ఎంపీటీసీ రామ్ మహేష్, నాయకులు జర్పుల శ్రీనివాస్, ఏనుగుల రాకేష్, తమ్మిశెట్టి వెంకటపతి, పగడాల శ్రీనివాస్, రామసాని గోపాల్‌రెడ్డి, గిరినాయక్, మడుగు సాంబమూర్తి, బానోత్ మంత్రియ, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రేఖ ఉప్పలయ్య, రామచంద్రాపురం అధ్యక్షులు తొట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.