Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలవ్యాప్తంగా సుమారు 24 చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. క్రైస్తవులందరూ అర్ధరాత్రి నుంచే ప్రార్ధనాల్లో భాగస్వాములయ్యారు. కోవిడ్, ఒమిక్రాన్లను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వ హించారు. అంకంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కౌశెట్టివాయి చర్చిలో పాస్టర్ బాలరాజు, సర్పంచ్ వట్టం సావిత్రి పాల్గొని పేదలకు, వద్ధులకు, వితంతువులకు వస్త్రాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కాటాపూర్ లో పాస్టర్లు ఏసురత్నం, బాగె నర్సింహులు, సంఘ పెద్దలు ఎల్లబోయిన భిక్షపతి, సర్పంచ్లు పుల్లూరు గౌరమ్మ, ఎల్లబోయిన ఝాన్సీరాణి రాంబాబు హాజరై ప్రార్ధనలు చేశారు. తొలుత కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లు ఏసురత్నం, బాగె నర్సింహులు, వట్టం బాలరాజు మాట్లాడారు. ఏసుక్రీస్తు ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని కొనియాడారు. కార్యక్రమంలో కాటాపూర్, పంబాపూర్, అంకంపల్లి గ్రామాల సర్పంచ్లు గౌరమ్మ, ఎల్లబోయిన ఝాన్సీ, వట్టం సావిత్రి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకుడు మద్దూరి రాజు, సాయిరి లక్ష్మినర్సయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఇందారపు లాలయ్య, మాజీ ఎంపీటీసీ దానక నర్సింహారావు, హోటల్ స్వామి, పాయం సమ్మయ్య, రమేష్, పులి రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.