Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని వాజ్‌పేయి 97 జయంతి నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. దేశంలో 67 ఏండ్లపాటు రాజకీయ జీవితం గడిపారని, అజాతశత్రువుగా కీర్తి గడించారని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రెండున్నరేండ్లు, విదేశాంగ మంత్రిగా ఆరేండ్లు, ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినా నిరాడంబరుడిగానే జీవించారని తెలిపారు. అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అడప భిక్షపతి, జిల్లా కార్యదర్శి శ్రీమంతుల రవీంద్రచారి, కార్యాలయ కార్యదర్శి చల్లురి మహేందర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కష్ణాకర్రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతిరెడ్డి రాకేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని పసరాలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్‌పారు జయంతి వేడుకలు నిర్వహించారు. వాజ్‌పారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కర్ర సాంబశివుడు, ప్రచార కార్యదర్శి సురేష్, నాయకులు కొత్త సుధాకర్‌రెడ్డి, పసుపులేటి కిరణ్, శాబాది జితేందర్, తండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : మండల కేంద్రంలో బీజేపీ ఆద్వర్యంలో మాజీ ప్రధాని వాజ్‌పారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత బుల్లెట్ కష్ణ నాయక్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బానోతు సురేష్‌నాయక్, లూనావత్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు సిద్దు, కార్యదర్శి తరుణ్, తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి ఆధ్వర్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి నివాళ్లర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బండారు రవీందర్, నాయకులు బిక్షపతి, వీరన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.
కాటారం : మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పూసాల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్రప్రసాద్, గంట అంకన్న, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్య రంజిత్ కుమార్, కొండ రాజమల్లు, శ్రీహరి, రవి, జిల్లాల శ్రీశైలం, వెంకట్‌రెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.