Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలో క్రైస్తవులు శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగపేట, కమలాపురం, కోమటిపల్లి, తిమ్మంపేట, మల్లూరు, చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట, అకినేపల్లిమల్లారం గ్రామాల్లోని చర్చీల్లో నిర్వాహకులు క్రైస్తవ సోదరుల సమక్షంలో కేక్‌లు కట్ చేశారు. అనంతరం యేసు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. పలు చర్చీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఫాదర్లు ఎల్పీ జ్ఞానేష్, ఆదామ్, దేవరాజు, తిమోతీ, విజయరాజు, ఆంద్రయ్య, పీటర్, కపానిధి, టైటస్, నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చిన్నపెల్లి రాంబాబు, ధీగొండ కాంతారావు, చిన్నపెల్లి స్వామి, బసారికారి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.