Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో కన్జ్యూమర్ లా చైర్, నల్సార్ న్యాయ విశ్వవిద్యా లయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం న్యాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర వినియోగ దారుల సమాఖ్య సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య చేతుల మీదుగా జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య రాష్ట్ర స్థాయి వినియోగదారుల ప్రశంసాపత్రం అందుకున్నారు. మల్లయ్య 30 ఏండ్లుగా ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో వినియోగదారుల ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొంటూ ఉమ్మడి జయశంకర్ జిల్లా వినియోగదారుల సమాఖ్యను ప్రారంభించి జిల్లావ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే విద్యార్థి వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేస్తూ వినియోగదారులను చైతన్యవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు రాష్ట్రస్థాయి ప్రశంసా పత్రం అందించారు. మల్లయ్య గోవిందరావుపేట మండలంలోని చల్వాయి జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రశంసాపత్రం అందుకున్న సందర్భంగా మల్లయ్యను మండలానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిదులు అభినందించారు.