Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
జనవరి 9న భద్రాచలంలో ఆదివాసీ మహిళా శక్తి సదస్సు నిర్వహించనున్నట్టు ఆదివాసీ 9 తెగల సమన్వయకర్త చుంచు రామకష్ణ, ఆధార్ సొసైటీ అధ్యక్షుడు కల్తీ వీరమల్లు తెలిపారు. మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో వారు శనివారం పర్యటించారు. గుంజేడు ముసలమ్మ, గుండం రామక్క, ఎంచగుడం కొమ్మాలమ్మ, మొండ్రాయి గూడెం గదా సూలం, తదితర ఆదివాసీ ఆలయాల్లో పూజలు చేసి ఆదివాసీ జోడా యాత్రను ప్రారంభించారు. అనంతరం మహిళా శక్తి సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగులు, ఆధార్ సొసైటీ, రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.