Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క పేదలకు అండగా ఉంటున్నారని ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపూత్ సీతారాం నాయక్ తెలిపారు. మండలంలోని చల్వాయిలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాష్ సతీమణి సునీతకు రూ.16 వేల 500లు, సత్తు లత వీరస్వామిలకు రూ.7 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సీతారాం నాయక్ శనివారం అందించి మాట్లాడారు. పేదలను ఆదుకునేలా ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంలో ఎమ్మెల్యే సీతక్క చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి అనిల్, చాపల ఉమాదేవి, ఉపసర్పంచ్ తేళ్ల హరిప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్, పెండెం శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ బోనగాని సారయ్య, తదితరులు పాల్గొన్నారు.