Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణ
ఇంటర్ విద్యార్థి కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-చిట్యాల
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని చల్లగరిగకు చెందిన ఇంటర్ విద్యార్థి వరుణ్ ఆత్మహత్య చేసుకోగా అతడి తల్లిదండ్రులను గండ్ర సత్యనారాయణ శనివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. వరుణ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుట్ల తిరుపతి, సీనియర్ నాయకులు పులేందర్‌రెడ్డి, గడ్డం కొమురయ్య, నల్ల రాజరెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజు, కరుణాకర్, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.