Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు గునిగంటి మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజితండా లో శనివారం మిర్చి పంట క్షేత్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడారు. మండల వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా నల్ల తామర వైరస్ సోకడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. రైతులు ఎకరానికి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా లాభం రాకపోగా పూర్తిగా నష్టపోయారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లయ్య, సుధాకర్, షణ్ముఖం, నారాయణ, మల్లారెడ్డి, వెంకట్రెడ్డి, బాలు, శ్రీను, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.