Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరసయ్య
నవతెలంగాణ-రేగొండ
గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో జరిగే రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం కేసీఆర్ ప్రభుత్వ పిరికి చర్యగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప కాయల నర్సయ్య అభివర్ణించారు. సోమవారం మండలం అధ్యక్షులు నరసయ్య ను, ఎండీ అస్లాం, గండి తిరుపతి, కొలేపక సాంబయ్య, వానరాశి అజరు ఎడ్ల మల్లారెడ్డి, ప్రసంగి మేకల, భిక్షపతి, బొల్లేపల్లి చంద్రమౌళిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని ఆయన అన్నారు.