Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన భిక్షపతి ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబానికి గ్రామంలోని వికలాంగుల పొదుపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిలక్ష్మీ, రాపాక యాకన్న మాట్లాడారు. సంఘంలోని 10 మంది సభ్యులు కలిసి 50 కేజీల బియ్యం సాయం అందించినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో లక్ష్మీ యూపీఎస్ గ్రూప్ సభ్యులు ఆదిలక్ష్మి, యాకన్న, నరేష్, హైమ, మహేష్, యాకన్న, నర్సయ్య, శోభ, స్రవంతి, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.