Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
సహజ సంపదైన ఇసుకను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇసుకాసుర ులకు చుట్టాలే అవుతున్నాయి. ఇందుకు మండల కేంద్రమైన తాడిచర్ల మానేరే నిదర్శనం. ఇసుకాసురులు అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా కు తెగబడుతున్నారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఇసుక రవానా జోరుగా కొన సాగుతోంది. అయితే రెవెన్యూ, మ్కెనింగ్, అటవీశాఖ, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే ఈ ఇసుక దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మానేరు నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుం టున్న పరిస్థితి. పలువురు యువకులు సంభందిత అధికారులకు సమాచారమిచ్చినా చోద్యం చూస్తుండడం గమనార్హం. ఇసుక వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ట్రిప్పుకు రూ. 15వందల నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. మానేరు లో నిబంధనలకు విరుద్ధంగా నాలుగు నుంచి ఆరు అడుగుల లోతు ఇసుక తోడుతుండడంతో భూ గర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.