Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైఎస్సాఆర్టీపీ వరంగల్ పార్లమెంట్
కోకన్వీనర్ అప్పం కిషన్
అ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు మద్దతు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి సీఆర్నగర్ ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్టీపీ వరంగల్ పార్లమెంటు కో కన్వీనర్ అప్పం కిషన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 3వవార్డు సీఆర్నగర్, బాంబులగడ్డ ప్రాంతంలో 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటూ ప్రభుత్వానికి ఇంటి పన్నులు, నల్ల పన్నులు, విద్యుత్ చార్జీలు , మున్సిపాలిటీలో అనేక రకాలుగా పన్నులు ప్రభుత్వానికి కడుతున్నారన్నారు. హఠాత్తుగా కొంత మంది భూ మాఫియా నాయకులు అధికార పార్టీ అండతో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వారిపై దాడులు చేయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అనంతరం కలెక్టర్ స్పందించి అధికారులను అప్రమత్తం చేసి న్యాయం చేస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుడుదులవేంకటేష్, శ్యామ్, రాజయ్య, తిరుమల, వెంకన్న, శ్రీనివాస్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.