Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన ఒక అప్రకటిత ఎమర్జెన్సీనీ తలపిస్తు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. సోమవారం హంటర్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజరుకుమార్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్లకుండా పోలీసుల సాయంతో ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం అమానుషన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇటువంటి నిర్బంధాలు చూడలేదని, బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న సీఎం కేసీఆర్ తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.
నవతెలంగాణ-కాజీపేట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు హైదరాబాద్లో తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్లకుండా సోమవారం మడికొండ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గడ్డం మహేందర్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్ లతో ప్రజా వ్యతిరేకతను ఆపలేరన్నారు. . అరెస్టయిన వారిలో ముత్తోజు సురేష్, ధరావత్ సునీల్, బైరి సతీష్, పల్లపు అశోక్, పల్లపు యుగేందర్, బేతి రమేష్, సదానందం, నిఖిల్ రావు తదితరులున్నారు.
నవతెలంగాణ-ఆత్మకూరు
బండి సంజరు చేస్తున్న నిరాహారదీక్షకు వెళ్తున్న బీజేపీ నాయకులను సోమవారం పోలీసులు ముంద స్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, ప్రధాన కార్యద ర్శులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, బలవంతుల రాజు, నాయకులు వంగాల బుచ్చిరెడ్డి తదితరులున్నారు.
నవతెలంగాణ-ధర్మసాగర్
అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చిలుక విజరు రావు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేస్తున్న నిరుద్యోగ దీక్ష వెల్లకుండా సోమవారం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం పిరికిపంద చర్యని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అరెస్టయినవారిలో రాష్ట్ర సీనియర్ నాయకులు గంకిడి వెంకట రెడ్డి, మండలాధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి శ్రీ రాముల విజరు, జిల్లా బీజేవైఎం కార్యదర్శి చట్ల రాజు గౌడ్ తదితరులు ఉన్నారు.