Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ చీఫ్‌విప్ వినరు భాస్కర్
నవతెలంగాణ సుబేదారి
క్రీడాకారులకు అంగవైకల్యం అడ్డుకాదని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ అన్నారు. వీలు ఛైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనోస్థైర్యం అంగవైకల్యాన్ని జయిస్తుందని వికలాంగులు నిరుపించారన్నారు. వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ వారికి కిట్లను సమకుర్చిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామన్నారు. హనుమకొండ నగరంలో వికలాంగుల టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమన్నారు.