Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రభుత్వ భూములు అన్యాక్రా ంతమై ఆక్రమణకు గురి అవు తున్నాయని, వాటిని పరిరక్షించాలని సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హసన్ పర్తి తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు మాట్లాడుతూ.. చౌదరి కుంట సర్వే నెంబర్ 180లో 27 ఎకరాల 20 గుంటలు భూమి ఉంటుందని, దాని చుట్టుపక్కల ఉన్న హద్దులను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వాపోయారు. భీమారంలోని పుట్టలమ్మ చెరువు సర్వే 250 నెంబర్ గల భూమి అక్రమణకు గురవుతోందన్నారు. ఆ భూములకు రీ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. నిరు పేదలకు ఇంటి స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారికి మాత్రం స్థలాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను అక్రమీస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోల్కొండ కుమార్, జోరిక మొగిలి, నమిండ్ల ఐలయ్య, దామెర సునీత, సదానందం పాల్గొన్నారు.