Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
నేడు, రేపు జనగామ జిల్లా కార్మిక, కర్షక, ప్రజా సమస్యలే పరిష్కార లక్ష్యంగా జరిగే సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోమవారం పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్రాజం అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో కనకారెడ్డి మాట్లాడారు. మూడేండ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్న క్రమంలో నేడు, రేపు పట్టణంలోని వైష్ణవి గార్డెన్లో పార్టీ జనగామ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక, కర్షక, మహిళా, వికలాంగులు, వృత్తి దారులు, విద్యా, వైద్యం, నిరుద్యోగులు, ఉపాధి, ఉద్యోగులు, వర్తక వ్యాపార వాణిజ్య రంగాల పట్ల అనుసరిస్తున్న విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటాలు, ఉద్యమాల రూపకల్పన చేయనున్నట్టు తెలి పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆస్తులను, ప్రభుత్వ రంగాలను, సంస్థలను, ప్రకృతి సహజ వనరులను ప్రయివేట్ బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టపెడు తోందన్నారు. దేశ ప్రజల మధ్య మతం, ధర్మం పేరుతో అల్లర్లు సృష్టిస్తూ రాజకీయ పబ్బం పొందేందుకు కుట్ర పన్ను తున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు లక్ష్యంగా ప్రజలు పోరాడి సాధించుకున్న ధనిక రాష్ట్రంను అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పారు. ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి విస్మరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేష న్లు లేక నిరుద్యోగులు ప్రాణాలను తీసు కుంటున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్ష పార్టీల నాయ కులపై సైతం అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లల్లో పెట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, గొల్లపల్లి బాపురెడ్డి, పోత్కనూరి ఉపేందర్, సాంబరాజు యాదగిరి, రామావత్ మీట్యా నాయక్, సింగారపు రమేష్, సోమ సత్యం, బోట్ల శేఖర్, బోడ నరేందర్, మండల కార్యదర్శులు బెల్లంకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.