Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వ్యవసాయ మార్కెట్‌ను అభివద్ధి పథంలో నడిపించేందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం, రైతులు సహకరించాలని వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గుజ్జరి రాజు అన్నారు. సోమవారం మార్కెట్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఆదేశానుసారం పాలకవర్గం సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ పాల్గొని మాట్లాడుతూ మార్కెట్‌కు ధాన్యం తెచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటూ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ చల్లా చందర్ రెడ్డి, ఎంపీడీఓ కుమారస్వామి, పాలకవర్గ సభ్యులు చిగురు సరితాంజనేయులు, బత్తుల రాజన్ బాబు, రంగు హరీష్, తాటికాయల వరుణ్, పెంతల రాజ్ కుమార్, జొన్నల సోమశేఖర్, ఐత సుప్రియసంతోష్ పాల్గొన్నారు.