Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు మండలంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో పోశారు. నిర్వాహకులు సకాలంలో తూకం వేయకపోవడం తో వరిధాన్యం పశువుల పాలైన సంఘటన మండల కేంద్రమైన తాడిచర్లలో సోమవారం చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా కాంటాలు పెట్టడంలో నిర్వాహకుల అలసత్వం వల్ల రైతులు నష్టపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి విపత్తు, తెగుళ్లను ఎదుర్కొరని పంట పండిస్తే నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ధాన్యం పోసి నెలలు గడిచినా తూకం వేయడం లేదని పుప్పాల రాజు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సంభందిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.