Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎంపీపీ బి రాణిభాయి రామారావు అన్నారు. సోమవారం మండలంలోని బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన 17మంది సభ్యులతో మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మెన్‌గా ఎంపీపీ రాణిబారురామారావు, కార్యదర్శిగా ఎంపీడీఓ శంకర్‌నాయక్, కన్వీనర్‌గా సీడీపీఓ రాధికరెడ్డిని నియ మించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలో బాలల సంక్షేమానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెడు వ్యసనాలకు బానిసయ్యే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. బాలల సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారులకు సూచించారు. బాలల సమస్యలు లేని మండలంగా మహాదేవపూర్ మండలాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి నెల మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో బాలల సమస్య లపై చర్చించి పరిషర్కించే దిశగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఆర్ రాధిక, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కె శిరీష, ఎస్సై రాజ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ ప్రమోద్, స్థానిక సర్పంచ్ శ్రీపతి బాపు, కమిటీ సభ్యులు ఏ.ప్రభాకర్, కే గీతబారు, సూపర్ వైజర్లు మమత, సరస్వతి, విజయకుమారి, బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.