Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ జి మోహన్
నవతెలంగాణ-భూపాలపల్లి
చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకుంటే సదరు యజమానులపై కేసులు నమోదు చేయాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ జి మోహన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలిస్ కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతర అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు ఆదేశాల మేరకు 2022 జనవరి 1-31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్లో భాగంగా బాలల సంక్షేమ కమిటీ మహిళా శిశు సంక్షేమ కార్మికశాఖ చైల్డ్ లైన్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ వ్యాపార సంస్థలు, ఇటుక తయారీ కేంద్రాలు భవన నిర్మాణ పనులు, కర్మాగారాల కేంద్రాల్లో బాలలను గుర్తించడంతో పాటు వెట్టిచాకిరి చేస్తున్న యజమానులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్లో 80మంది చిన్నారులను వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పించారు. అదే స్ఫూర్తితో ఆపరేషన్ స్మైల్ ద్వారా ఎక్కువ సంఖ్యలో చిన్నారులను గుర్తించి వారి తల్లి దండ్రులుగానీ, బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించాలన్నారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ సీఐ పెద్దన్నకుమార్, సీపీఆర్ సీిఐ సీహెచ్ అజరు, ఎస్బీ-2 సీఐ జానీ నరసింహులు, సీడూబ్ల్యూసీ దాస్యం వేణుగోపాల్, డసీపీఓ హరికష్ణ, ఎన్జీఓ జాన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునిల్, హెచ్ఎం ఎన్జీవో రజిత పాల్గొన్నారు.