Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాలనీవాసులపై దాడికి పాల్పడిన ఎన్ఆర్ఐ
ఖలీల్ దొరపై చర్యలు తీసుకోవాలి
అ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా, కలెక్టర్కు వినతి
నవతెలంగాణ-భూపాలపల్లి
22 ఏండ్లుగా సీఆర్నగర్(బాంబుల గడ్డ) భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి మూడో వార్డులో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ మండల కార్యదర్శి కుడుదుల వెంకటేష్, టౌన్ కార్యదర్శి క్యాథరాజ్ సతీష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కుడుదుల వెంకటేష్ మాట్లాడుతూ.. ఇటీవల ఖలీల్ దొర అనే ఎన్ఆర్ఐ ఈ కాలనీకి సంబంధించిన భూమి తనదంటూ కాలనీ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. గుడిసెవాసులపై దౌర్జన్యం చేసి దాడి చేశాడని తెలిపారు. అయినా ఖలీల్ దొర పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి సీఆర్నగర్ కాలనీవాసుల సమస్యలు పరిష్కరించి, ఎన్ఆర్ఐ ఖలీల్ దొరపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖలీల్ నుంచి కాలనీవాసులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు వైఎస్సాఆర్టీపీ వరంగల్ పార్లమెంట్ కో- కన్వీనర్ అప్పం కిషన్ పూర్తి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఇండ్ల పట్టాలు వచ్చేంతవరకు కాలనీవాసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుస్సా శ్యామ్, రామ్మోహన్ చారి, రఘు, రాజయ్య, శేఖర్, శ్రీను, పోశయ్య, అనిల్, రాజు పాల్గొన్నారు.